Kavithalu

Oct 18, 2020 | 10:27

రోజు రోజుకీ సూర్యుడు చిగురించినట్టు ఆశ చిగురిస్తూనే వుంటుంది తీరం మీద కూలిపోయే కెరటాలదేముంది కడలి కడుపులో కలలు కలలుగా అలలు చిగురించినట్టు

Oct 18, 2020 | 10:22

వేదవేదాంగాలు ఏమి చెప్పాయో ఉపనిషత్తులూ పురాణాలూ ఏమి తర్కించాయో, ఏ అభూత కల్పనలు చేశాయో, భారతంలో చొరబడిన భగవద్గీత ఏ బానిసల పుట్టుకకి పురుడు పోసిందో

Oct 18, 2020 | 08:56

నేనొక రాత్రిని అగ్నిలో దహింపజేస్తున్నాను అది రాత్రిలోని అగ్నో అగ్నిని మింగేసిన రాత్రో నాలోకి చొరబడుతున్న జ్వలనం నిలబడనివ్వదు, కూర్చోనివ్వదు

Oct 12, 2020 | 19:27

ఇదేమి రాజ్యము ఇదేమి స్వరాజ్యము నడిరేయి నిజాన్ని కాల్చిన నీతిలేని నీచపు రాజ్యము దగ్గరుండి దేహాన్ని కాల్చిన రాజకీయ రాజ్యము ఇదేమి దేశము

Oct 12, 2020 | 17:58

అంతా శాకాహారులే .. బాపనీదిలో రొయ్యల గంపేదని అడక్కండి! అందరూ సాధుపుంగవులే .. ఏ చిత్తకార్తె కుక్కలు ఆమెను పీక్కుతిన్నాయని ప్రశ్నించకండి

Oct 12, 2020 | 17:55

కడుపుకింత గంజికోసం కూలీకెళ్ళక తప్పని అమ్మానాన్న చిన్నారితమ్ముని ఆడిస్తూ ఇంట్లో ఒంటరి నీవు బస్తీ అంతా బంధువులే తాగితే రాబంధువులే నీ అమాయక మోముని మసి చేసినదెవడమ్మ...

Oct 04, 2020 | 19:21

రాత్రి నే నా మస్తిష్కంలో నిద్దుర పోయా చుట్టూ ఆలోచనల చీకటి.... నాకు ముందే ఇక్కడో సమాజం పూరిగుడిసెలు మురికివాడలు ఆకలి దారిద్య్రం ఆసరయ్యే ఆదరణ కోసం

Oct 04, 2020 | 19:14

పల్లెలు వణుకుతున్నాయి జ్వరమొచ్చినట్టు చేతులు కాళ్ళ నులిపెట్టినట్టు గుండెలు భీతిల్లినట్టు నరాలు లాగేసి పిండేసినట్టు పల్లెలు వణుకుతున్నాయి

Sep 28, 2020 | 18:07

చిత్రాల నుండి విచిత్రాల వరకు చిత్రంగా సాగే సాధనం ప్రాంతాల నుండి ప్రపంచపు నలుమూలల్ని దృశ్యమాలికగా తీర్చి కనుల ముందు పెట్టే నైజం సోషల్‌ మీడియా

Sep 28, 2020 | 16:26

నగరం చీకటి దుప్పటి కప్పుకుని పడుకున్నపుడు మన ఇంటిముందు మిణుగురులై ప్రకాశించింది వాళ్లే బతుకుల్ని బట్టీల్లో కాల్చి తందూరీలై మన ఆకల్ని తీర్చింది వాళ్లే

Sep 28, 2020 | 16:13

ఆయుఒక్కటే మిగిలింది అటో యిటో తేల్చుకుందాం రేపటి వరకు ఆగొద్దు జమై కదులుదాం ఈపొద్దు రైతులారా ఏకమవుదాం రాజ్యం తీరును నిరసిద్దాం బడా కంపెనీల

Sep 28, 2020 | 16:03

రేయంతా కలలుగన్న కళ్ళు రేపటి ఉదయానికి ఉషస్సు కిరణాలై కళ్ళలో వాలేవి అనుకోకుండా వచ్చి వాలే కొన్ని దు:ఖాలు శ్రమతోనో, సేవతోనో చరమగీతంపాడి చల్‌ మోహనరంగా అని