Oct 12,2020 17:55
ఒంటరి

కడుపుకింత గంజికోసం
కూలీకెళ్ళక తప్పని అమ్మానాన్న
చిన్నారితమ్ముని ఆడిస్తూ ఇంట్లో ఒంటరి నీవు
బస్తీ అంతా బంధువులే తాగితే రాబంధువులే
నీ అమాయక మోముని మసి చేసినదెవడమ్మ...

ఉరకలేసే ఉత్సాహం భవితకోసం ఆరాటం
కాలేజీ బ్యాగేసుక పరుగుపరుగున నువ్వోస్త్తోంటే
సీనియరేంటి జూనియరేంటి
అందరూ గోతికాడనక్కలే వెకిలిచూపులే వెర్రిచేష్టలే...
అందరూ మంచోల్లేనన్న నిన్ను
ఎవడమ్మా మాయ చేసింది...

పిఎస్సిలు పోటీపరీక్షలు అలుపెరుగని
నీ కష్టం నిన్నో ఉద్యోగానికి ఎంపిక చేస్తే
బాసేవడు కొలీగ్‌ ఎవడు
నీ కొచ్చిన ఓ కష్టానికి
అనునయింపు అంటూ ఒకడు
ఓదార్పు అంటూ ఒకడు
అందరూ మేకవన్నె పులులే
వేటాడేచూపులే డబుల్మీనింగ్‌ డైలాగులే
నీ సున్నిత మనసుని మైలచేసిందెవడమ్మా...
బస్తీ ఏంటి కాలేజేంటి ఆఫీసేంటి అంతటా జనాలే...
అయినా, సమూహంలో నీవొంటరివే...
కాదా ?
అంతటా అరణ్యమా !
సంచరించు మగాలే మగాళ్ళా!
ఇంకా కాదా ??
జనారణ్యంలో అంతటా చిత్తకార్తే కుక్కలా !


- అశోక్‌ గుంటుక
9908144099