Nov 22,2023 13:37

వాషింగ్టన్‌: అమెరికాలోని టెక్సస్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాశంలో ఎగురుతున్న చిన్న విమానం ఒకటి సడెన్‌గా కూలిపోయింది. ప్లానోలోని ఓ షాపింగ్‌ సెంటర్‌ పార్కింగ్‌లో పడింది. దీంతో మంటలు ఎగిసిపడి విమానంతో పాటు పలు వాహనాలు కాలి బూడిదయ్యాయి.ఈ ప్రమాదంలో పైలట్‌ అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది.. మంటలను ఆర్పివేశారు. విమానం క్రాష్‌ ల్యాండ్‌ కావడానికి కారణమేంటనే దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.