అహ్మదాబాద్: ఐసిసి సెక్సువల్ క్వాలిఫికేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ట్రాన్స్ జెండర్లపై నిషేధం విధించింది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం.. మగ నుంచి ఆడగా మారిన యుక్త వయస్సు వచ్చిన ఏ ఆటగాడు అయిన మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో పాల్గొనడానికి అనుమతించమని స్పష్టం చేసింది. మంగళవారం ఐసీసీ బోర్డు ఆమోదించిన కొత్త నిబంధనల ప్రకారం.. మగ నుంచి ఆడగా మారిన ఏ ఆటగాడిని మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో పాల్గొనడానికి అనుమతించబడరని ప్రకటించింది.మహిళల క్రికెట్ న్యాయబద్ధతను కాపాడేందుకు, ప్లేయర్ల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ చెప్పింది. ''9 నెలల పాటు విస్తత సంప్రదింపులు జరిపిన తర్వాత ఐసీసీ ఈ లింగ అర్హత నియమావళిని ఆమోదించింది'' అని తెలిపింది.