Oct 12,2020 19:27
జస్టిస్‌ ఫర్‌ మనీషా..??

ఇదేమి రాజ్యము
ఇదేమి స్వరాజ్యము
నడిరేయి నిజాన్ని
కాల్చిన నీతిలేని
నీచపు రాజ్యము
దగ్గరుండి దేహాన్ని
కాల్చిన రాజకీయ రాజ్యము
ఇదేమి దేశము
ధర్మాన్ని దహించిన
అధర్మ దేశము
బాధితులని బంధించి
బెదిరించే నిర్బంధ దేశము
ఇదేనా స్వరాజ్యము
ఇదేనా స్వతంత్ర దేశము
స్వరాజ్యమని విర్రవీగిన
ఆ గొంతులెక్కడ
నా అక్కచెల్లెళ్ళు స్వేచ్ఛగా
తిరిగే ఆ దేశం ఎక్కడుందని
ప్రజల కన్నీరే నేడు
సిరాచుక్కై ప్రశ్నిస్తోంది

చట్టాలు తెలియదని
రాజకీయ చుట్టాలు
లేరని అధికారంతో
బాధితుల గొంతును
అదిమి పట్టి
అణచి వేస్తోంది
ఈ పాలక వర్గము

ప్రజలారా..!
ఏకం కండి
రేపు మన ఇంటి
వంతే కావచ్చు
గళమెత్తి న్యాయం
కోసం గర్జించండి
ఇప్పుడు ఉన్న చట్టాలు
శిక్షలు ఈ మానవ
మృగాలను మార్చలేవని
మానవతా దృక్పథంతో
మానవీయ కోణంతో
కొత్త చట్టాలతో శిక్షలు
అమలు పరచాలని
నినదించండి నిరసన
వ్యక్తం చేయండి


- నాగరాజు సాలం
9493745453