వేదవేదాంగాలు ఏమి చెప్పాయో
ఉపనిషత్తులూ పురాణాలూ
ఏమి తర్కించాయో, ఏ
అభూత కల్పనలు చేశాయో,
భారతంలో చొరబడిన భగవద్గీత ఏ
బానిసల పుట్టుకకి పురుడు
పోసిందో
బైబిలు ఎవ్వని రెండవ రాకడకి ఏ
సంకేతాలు చూపిందో, ఖురాను
అంతిమ సందేశమని దేనిని ఏ
ఆధారంతో శాసనం చేసిందో
ఎవరూ మా ప్రశ్నలకి సమాధానం
చెప్పరు.
ఒక్క దేవుడూ, ఒక్క
పురోహితుడూ,
ఒక్క ఇమామూ, ఒక్క పాస్టరూ
మా ఇహలోక హింసకి ఇక్కడే
ఎందుకు లెక్క తేల్చరు?
మీ కలరాలూ, కరోనాల కోసం
కవులున్నారు కదా, కొత్త
పురాణాలు రాసుకోండి.
మీ రైళ్లూ, మీ విమానాలూ, మీ
రాకెట్లూ, మీ యుద్ధ ట్యాంకులూ
మీకు శుభమగుగాక.
మమ్మల్ని మా ఆదిమ
ఆయుధాలను అన్వేషించుకుంటూ,
మా అరణ్య భూములలోకి మరలి
వెళ్ళనీండి
మనం మళ్ళీ ఏ లంక
రణంరంగంలోనో
ఏ కురుక్షేత్ర యుద్ధభూమిలోనో
ఎర్రబారిన ఏ ద్రావిడ
మైదానంలోనో
కలుసుకునేదాక!
- దేవిప్రియ
9866111874