ప్రజాశక్తి గణపవరం : నారొలోకేష.ప్రారంబించే యువగళం.పాదయాత్ర జయప్రదం కావాలని కోరుతూ బుధవారం పిప్పర లో తెలుగుదేశం ఎస్సీ సెల్ మండల కమిటీ ఆధ్వర్యంలో యువగళం పోస్టర్లను మండల కమిటీ అధ్యక్షులు ఆండ్రు నరసన్న విడుదల చేశారు ఈనెల 27 నుండి జరిగే పాదయాత్రలో మండలం నుండి యువత అధిక సంఖ్యలో పాల్గొవాలని ఆయన పిలుపునిచ్చారు ఏలూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇయాల సంజీవరావు మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర అడ్డుకుంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు పి యుగంధర్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి డి సోమరాజు, ఉంగుటూరు మండలం ఎస్సి సెల్ అధ్యక్షులు ఎన్ ఆశీర్వాదం, నిడమర్రు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు ఓగిరాల బాబురావు, ఎక్స్ ఎంపీటీసీ జి బాబురావు, నరేంద్ర, కరుణానిధి, చిన్నధర్మయ్య సీతారాములు, నరేష్, ఏసురత్నం, పాల్గొన్నారు.










