ప్రజాశక్తి-కొయ్యలగూడెం : కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని, ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ కడపకు పరిశ్రమల అంశాలను పట్టించుకోలేదని, పోలవరం నిర్వాసితులు సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించడంలో విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి దుయ్యబట్టారు. ఆయన మాట్లాడుతూ సిపిఎం రాజకీయ విధానాన్ని ప్రజలకు చెప్పటం ప్రజా సంక్షేమం అభివృద్ధి సామాజిక న్యాయం ప్రజా ప్రణాళిక 31 డిమాండ్లతో ప్రజలకు వివరించే కార్యాచరణతో ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా ఈనెల 30 నుంచి రాష్ట్రంలో మూడు బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోని, శ్రీకాకుళం జిల్లా మందస పార్వతీపురం, మన్యం జిల్లా సీతంపేట నుంచి విజయవాడ వరకు బస్సు యాత్ర జరగనున్నాయి. అని తెలిపారు. నవంబర్ 15వ తేదీన విజయవాడలో ప్రజా రక్షణ భేరి సభ నిర్వహించుచున్నామని ఈ సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బివి రాఘవులు, హాజరవుతారని తెలిపారు.
సిపిఎం కొయ్యలగూడెం మండల కార్యదర్శి శుక్ల బోయిన రాంబాబు, మాట్లాడుతూ నవంబర్ 7వ తేదీన కొయ్యలగూడెం బస్సు యాత్ర రానున్నది ఉదయం ఎనిమిది గంటలకు జంగారెడ్డిగూడెం రోడ్లో సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు సిపిఎం పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు, ప్రజాసంఘాలు అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజారక్షణ భేరి స్టిక్కర్లు కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుడెల్లివెంకటరావు, మండల నాయకులు ఏ దుర్గారావు, ఎస్ శివకుమార్, సిహెచ్ మరిడియా, పిల్లా తమ్మారావు, మర్రి త్రిమూర్తులు, జి గోపి, పి సురేష్, రాచూరి దుర్గారావు, రాచూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.