ప్రజాశక్తి-ఏలూరు జిల్లా : పోలవరంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం పర్యటించారు. ప్రోజెక్ట్ లో దిగువ కాఫర్ డ్యాం వద్ద జరగుతున్న డి వాటరింగ్ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఉన్న సీఫేజ్ నీటిని మరల్చేందుకు నిర్మాణం చేస్తున్న కాలువల పనులను మంత్రి సమీక్షించారు. ఈ పర్యటనలో యస్ ఈ నరసింహా మూర్తి, సిఈ సుధాకర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.