Jul 28,2023 20:58
  • రిషితేశ్వరి హత్య గురించి ఎందుకు మాట్లాడరు?

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఐదేళ్ల టిడిపి పాలనలో బిసిలకు ఏం మేలు చేశారో చెప్పే దమ్ముందా? అని వైసిపి ఎంపిలు ప్రశిుంచారు. శుక్రవారం ఏపి భవన్‌లో వైసిపి ఎంపిలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బీద మస్తానరావు, బెల్లాన చంద్రశేఖర్‌, బివి సత్యవతి మీడియాతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం నవరతాులతో బిసిలకు ప్రభుత్వ సంక్షేమానిు అందిస్తూ, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా గుర్తింపు తెచ్చిందన్నారు. ఏపిలో టిడిపి, దానికి మద్దతు తెలిపే ఇతర పార్టీలు ఉనికి కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నాయని అన్నారు. లోకేష్‌ గోబెల్స్‌ ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని పాట్లు పడుతున్నారని దుయ్యబట్టారు. అమర్‌నాథ్‌ హత్య గురించి ఒంగోలు బిసి సభలో ప్రస్తావించడాన్ని ఎంపిలు తప్పుపట్టారు. హత్యకు రాజకీయ కారణాలేవీ లేవన్నారు. అమర్‌నాథ్‌ తల్లి, సోదరితో అబద్ధాలు పలికించడం దారుణమన్నారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.10 లక్షలు ఇచ్చిందని, అంగన్‌వాడీ ఆయా పోస్టు, ఇంటిస్థలం, ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఆర్డర్‌కు క్లియరెన్స్‌ ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉండగా, సిఎం కార్యాలయానికి సమీపంలో ఉన్న నాగార్జున యూనివర్శిటీలో బిసి విద్యార్థిని రిషితేశ్వరి హత్యకు గురికాగా, కనీసం బాధితురాలి తల్లిదండ్రులిు కలవడానికి కూడా చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని విమర్శించారు. మహిళా అధికారిపై టిడిపి నేతలు చెయ్యి చేసుకుంటే, వారిపై చర్యలు తీసుకునే సాహసం చేయలేదన్నారు. ఈ ఘటలనపై మానవత్వం ఎందుకు చూపలేదని చంద్రబాబు ప్రశిుంచే దమ్ముందా అని లోకేష్‌ను ప్రశిుంచారు.