ఢిల్లీ : కేంద్రమంత్రి వర్గ ప్రత్యేక సమావేశం ముగిసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీ దాదాపు రెండు గంటల పాటు సాగింది. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ భేటీలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను బయటకు వెల్లడించలేదు. దీంతో ఈ సమావేశంలో మంత్రివర్గం ఏ నిర్ణయాలను తీసుకుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ స్పెషల్ సెషన్స్‌లో చారిత్ర్మాక నిర్ణయాలను తీసుకుంటామని ప్రధాని మోడీ పేర్కొనడంతో.. ఇవాళ జరిగిన భేటీలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను బయటపెట్టకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ, జైశంకర్, పీయూష్ గోయల్, గడ్కరీ, తోమర్ పాల్గొన్నారు.