- జిఓ 1ని పకడ్బందీగా అమలు చేయండి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై సోషల్ మీడియా, సైబర్ వేధింపులకు అడ్డుకట్ట వేయాలని, ఇందుకోసం ప్రత్యేక విభాగానిు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో జిఓ నెంబరు 1ని పకడ్బందీగా అమలు చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో హోమ్ శాఖపై సిఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి నేరానికీ మూలాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయని అన్నారు. అక్కడే గుర్తించి తుంచగలిగితే చాలా మందిని కాపాడినట్లవుతుందన్నారు. సోషల్ మీడియా ద్వారా వేధింపుల నుంచి బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంలో ఎలాంటి రాజీ వద్దని తెలిపారు. డ్రగ్స్, నార్కోటిక్స్ పంపిణీ వంటివి సోషల్ మాధ్యమాల ద్వారానే జరుగుతున్నాయన్నారు. మాదక ద్రవ్యాలను పూర్తిగా నివారించేందుకు రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలని, డ్రగ్ పెడలర్స్ పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సచివాలయాల్లో ఉను మహిళా పోలీసులకు కచ్ఛితమైన ప్రొటోకాల్ వుండాలని సూచించారు. దిశ యాప్ మీద మరోసారి డ్రైవ్ నిర్వహించాలన్నారు. ప్రతి ఇంట్లో ఈ యాప్ వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక దిశ పోలీస్ స్టేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా పోలీసులు ప్రస్తుత విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమీక్ష చేయాలన్నారు. అక్రమ మద్యం తయారీ, గంజాయిలో ఉన్న కుటుంబాలను ఆ వృత్తి నుంచి బయటపడేయాలని సూచించారు. వారికి ప్రత్యామాుయ జీవనోపాధిని చూపించే మార్గాలను పెంచాలన్నారు. స్పందన కింద వచ్చే అర్జీల పరిష్కారంలో చొరవ చూపాలనాురు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కిందకు స్పందనను తీసుకొస్తున్నామని తెలిపారు. మహిళలు, బాలికలపై వేధింపులు, ఇతరత్రా నేరాల నివారణకు విద్యాశాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖతో పోలీస్‌శాఖ సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, సిఎస్ కెఎస్ జవహర్‌రెడ్డి, డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.