న్యూఢిల్లీ : భారత్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సైబార్ దాడులు పెరిగినట్లు ఓ నివేదిక పేర్కొంది. 2021 మరియు 2023 సెప్టెంబర్ మధ్య 278 శాతం పెరిగినట్లు తెలిపింది. సమాచార సాంకేతిక శాఖ (ఐటి ) మరియు బిజెనెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ (బిపిఒ) సంస్థలతో సహా సేవల కంపెనీలపై దాడులు అత్యధిక వాటాను కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈ సమయంలో ప్రభుత్వ సంస్థలు లక్ష్యంగా సైబర్ దాడులు 460 శాతం పెరిగాయి. అయితే స్టార్టప్‌లు మరియు చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (ఎస్‌ఎంఇ)లపై 508 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
సింగపూర్‌కి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ సైఫోర్మా 2023 ఇండియా నివేదిక ప్రకారం.. 13.7 శాతంతో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం అత్యధికంగా సైబర్ దాడులను ఎదుర్కొంటుందని పేర్కొన్నట్లు ఎకనామిక్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. 9.6 శాతంతో అమెరికా రెండవ స్థానంలో ఉంది. 9.3 శాతం ఇండోనేషియా, 4.5 శాతంతో చైనా తరువాతి స్థానాల్లో నిలిచాయని ఆ కథనం పేర్కొంది.