ప్రజాశక్తి - ఆలమూరు : వైసీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు మండలంలోని చెముడులంకకు చెందిన భవాని మాలధారులు వాడపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి వారి దేవస్థానంనకు పాదయాత్ర నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలందిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆర్ధిక భరోసా కల్పించే ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసి, కరోనా కష్ట కాలాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాలేని పరిస్థితులలో కూడా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 1000 కోట్ల రూపాయల పైనే సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించి, 300 కోట్ల రూపాయలు పైనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ప్రత్యేక చొరవ చూపించి, కష్టం అని వెళ్తే వెంటనే స్పందించే స్థానిక శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మరలా 4 వ సారి శాసనసభ్యులుగా గెలుపొందాలని ఆకాంక్షిస్తూ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ ఆధ్వర్యంలో చెముడులంక గ్రామం నుండి భవానీ మాలధారులు పాదయాత్రగా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంనకు తరలివెళ్ళారు. మార్గమధ్యంలో రావులపాలెం సెంటర్లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భవానీ మాలధారులకు ప్రభుత్వ విప్, శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అల్పాహారం ఏర్పాటు చేసి అక్కడి నుండి కొంత దూరం వారు చేస్తున్న పాదయాత్రలో పాల్గొని వారికి కృతజ్ఞతలు తెలియచేశారు.










