
ప్రజాశక్తి-మండపేట : ముస్లిమ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహిస్తున్న రాష్ట్ర నూర్ బాష్, దూదేకుల ముస్లిం సింహగర్జనకు జిల్లా నలుమూల నుండి ముస్లిం సోదరులు ఆదివారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద జిల్లా నూర్ బాష్ సంఘం అధ్యక్షులు షేక్ ఇబ్రాహిం మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం అన్ని రాజకీయం పార్టీలు నూర్ భాష్, దూదేకుల ముస్లిం కులస్తులకు చట్ట సభలో తగిన ప్రాధాన్యం కల్పించుట, మైనార్టీ పదవులలో వర్గీకరణ నూర్ భాషా, దూదేకుల ముస్లిం కులస్తులకు పదవులు బడ్జెట్ తప్పనిసరిగా కేటాయించడం, ఏ రాజకీయ పార్టీ అయితే తమకు సముచిత స్థానం కల్పిస్తుందో ఆ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామన్నారు. అనంతరం ప్రత్యేక బస్సులలో సింహగర్జనకు తరలి వెళ్లారు.