ప్రజాశక్తి-రామచంద్రపురం : గత రెండేళ్లుగా వివాదాస్పదంగా మారిన ద్రాక్షారామ పివిఆర్ హైస్కూల్ యాజమాన్య విధానాలపై ఆదివారం ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ పక్కన నిరసన దీక్షలు చేపట్టారు. రాష్ట్ర వైసీపీ న్యాయ విభాగం నాయకులు మాగాపు అమ్మిరాజు ఆధ్వర్యంలో ప్రారంభమైన నిరసన దీక్షలకు పలువురు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో మాగాపు అమ్మిరాజు మాట్లాడుతూ రెండేళ్లుగా మూసివేసిన పివిఆర్ హైస్కూల్ యాజమాన్యం పైండా సత్య ప్రసాద్ అతని కుమారుడు ఇ క్కడ సుమారు 70 కోట్ల విలువైన ఆస్తులను నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, విద్యార్థుల్లో చదువు కోసం దాతలు దానంగా ఇచ్చిన ఈ భూమిని ఆస్తులను తమ స్వప్రయోజనాలకు కళ్యాణ మండపాలు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకోవాలని దురుద్దేశంతో హై స్కూల్ మూసివేసారని, తెలుగు తెరుస్తామని ప్రకటించిన దాన్ని అమలు చేయలేదని పైగా లేనిపోని కేసులు పెట్టి 13 మందిని వేధిస్తున్నారని ఆయన తెలిపారు. వీటన్నింటిపై న్యాయపోరాటం చేస్తామని అవసరమైతే అయిపోతున్న మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. యాజమాన్యం కోసం విధానాలపై ఇక్కడ ఆందోళనకారులు నినాదాలు చేశారు. కార్యక్రమానికి మద్దతునిచ్చిన వైసిపి నాయకులు పిల్లి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ ఇది సరైన విధానం కాదని పివిఆర్ హైస్కూల్ యాజమాన్యం దాత ఇచ్చిన భూములను హైస్కూల్ను సదుద్దేశంతో ఇక్కడ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని ఈ విధానాలను ఖండిస్తూ దీనిపై పోరాడుతున్న గ్రామస్తులకు అమ్మి రాజుకు తన మద్దతును తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ రెడ్డి సుబ్రమణ్యం నిరసనకారులకు మద్దతు తెలియజేశారు. కొంతమంది నాయకులు చీకటి ఒప్పందం చేసుకుని ఇక్కడ కోట్లాది విలువైన ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరిలోనూ మాట్లాడి స్కూలు తిరిగి తెరిచేందుకు ఏ విధమైన ఆదాయం సమకూరిన స్కూల్కే చెందే విధంగా చేసేందుకు తన మద్దతు ఉంటుందని యాజమాన్యం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని తప్పుడు కేసులు పెట్టడం ఆయన ఖండించారు. లేకుంటే పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించి తిరిగి నడిచే విధంగా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు శంకర్ నారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఇంతసంతోషం, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ చింతపల్లి వీరభద్రరావు, చోడిశెట్టి శివాజీ, నామ వెంకన్న బాబు, కొప్పిశెట్టి శ్రీనివాసు, ఆళ్ల బుజ్జి, రావూరి సుబ్బారావు ద్రాక్షారామ, అన్నాయి పేట, వేలం పాలెం, తోటపేట, వేగాయమ్మ పేట, హాసన్ బాధ, ఉండూరు, రామచంద్రపురం, తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఆటో యూనియన్ నాయకులు నిరసన దీక్షకు మద్దతు తెలిపారు.