Sep 19,2023 13:02

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను వైఎస్ఆర్సిపి పాలకొల్లు ఇంచార్జ్ గుడాల గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మెడికల్ కాలేజీలను కేటాయించింది. దీనిలో భాగంగా కొన్ని కాలేజీలను కూడా ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ దగ్గులూరు మెడికల్ కాలేజీ 470 కోట్ల రూపాయల తో నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ మెడికల్ కాలేజీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిర్మాణ పనులు ఏమి జరగటం లేదని ,పచ్చగడ్డి మోలిచిందని, పశువులు తిరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు ఆయన కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సరిగా పరిశీలించకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఎవరైనా సరే వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను పరిశీలించి మాట్లాడాలని తెలియజేశారు. త్వరలోనే ఈ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యడ్ల తాతాజీ, గుణ్ణం నాగబాబు, మకిడి విక్రమ్ తదితర వైసిపి నాయకులు పాల్గొన్నారు.