Oct 28,2023 15:58

ప్రజాశక్తి-గణపవరం : రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు బ్రాకెట్లో వాసు బాబు అన్నారు. శనివారం సిహెచ్ అగ్రహారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కామన్ రకం 21 83 గ్రేడ్ ఏ 22 03 కొనుగోలు చేస్తామని చెప్పారు రైతులు దళారి చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆర్.బి.కె కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది అని చెప్పారు వ్యవసాయ శాఖ ఇప్పటికే పంట నమోదు ప్రక్రియ పూర్తి చేసి ఈ క్రాఫ్ట్ లిస్టులు కేంద్రాల వద్ద ఉండే విధంగా చూడాలని చెప్పారు. ఈ క్రూ చేసుకున్న రైతుల వద్ద ధాన్యం పులి చేయడం జరుగుతుందని చెప్పారు. కళ్ళాలు వద్ద నుండి ధాన్యం సేకరించి వారికి ప్రభుత్వం మద్దతు ధర అందించడంలో ప్రభుత్వ సహాయకృతమైందని అన్నారు. ఎనలేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం క్వింటాల్ బస్తాకు 143 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పారు. గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మండలంలో నాలుగు ఐదు ఏర్పాటు చేశారని ఇప్పుడు ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి చుక్క అప్పారావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జీ వెంకటేశ్వరరావు తాసిల్దార్ పీ లక్ష్మీ ఎంపీడీవో జ్యోతిర్మయి ఏవో వై ప్రసాదు సివిల్ సప్లై డిఎంశివరామ్.ప్రసాద్. డీఎస్ఓ సరోజ ఆర్డిఓ శ్రీనివాసరాజు జడ్పిటిసి దేవవరపు సోమలక్ష్మి వైఎస్ఆర్ మండల అధ్యక్షులు దండు రాము ఉపాధ్యక్షులు పూసలపాటి వెంకటేశ్వరరావు ఏ డి ఏ మురళీకృష్ణ సొసైటీ కార్యదర్శులు మిల్లర్స్ రైతులు పాల్గొన్నారు.