Oct 21,2023 12:13
  • ఒంగోలు సంఘమిత్ర హాస్పిటల్కు తరలింపు..

ప్రజాశక్తి - చీరాల : చీరాల మండలంలోని బోయినవారిపాలెం గ్రామంలో వైసీపీ కార్యకర్త కుటుంబ సభ్యుడు మృతి చెందడంతో కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న కరణం వెంకటేషును ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టింది.ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. అందిన వివరాల మేరకు.. బోయినవారిపాలెం వెళ్లేందుకు రైల్వే గేటు వేసి ఉండటంతో ఆలస్యం అవుతుందని కార్యకర్త ద్విచక్ర వాహనం పై పరామర్శించేందుకు వెళుతున్న కరణం వెంకటేష్  ను ఎదురుగా వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు ఢీకొనింది.  ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం రోడ్డుపై జారీ పడడంతో వెంకటేష్ కాలు, చేయి కి  గాయాలు అయ్యాయి. పట్టణంలోనే ప్రైవేటు హాస్పిటల్లో ప్రధమ చికిత్స అనంతరం  ఒంగోలు సంఘమిత్ర హాస్పటల్కు తరలిస్తున్నట్లు సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..