Oct 26,2023 10:41

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ : స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరులను, సంఘసంస్కర్తలను, మరియు జాతీయ నాయకుల యొక్క జీవిత చరిత్రలు విద్యార్థులు చిన్నతనం నుంచి తెలుసుకోవాలి. విద్యాపరిషత్ ఉన్నత పాఠశాల ఇడుపులపాడు నందు పాఠశాల పూర్వ విద్యార్థి  శిఖాకొల్లి కాశి పాఠశాలకు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు, సంఘసంస్కర్తలు, స్వాతంత్ర సమరయోధుల ఫ్రేములుతో కూడిన చిత్రపటాలను 26 పాఠశాలకు బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పేరిరెడ్డి తమ సందేశంలో శిఖాకొల్లి కాశి కుటుంబ సభ్యులను అభినందించారు. సుమారు 20000 రూపాయలు విలువ గల వివిధ జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, సంఘసంస్కర్తలు యొక్క ఫోటోలుతో కూడిన  ఫోటో ఫ్రేమ్లను పాఠశాలకు అందించినందుకు ప్రత్యేకంగా అభినందించి, విద్యార్థులు చిన్నతనం నుంచే దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులు త్యాగాలను ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలని దేశంలో వివిధ రకాలుగా సమాజంలో మార్పు  తీసుకురావడానికి, సమాజమును చైతన్యం చేయడానికి కృషి చేసిన సంఘసంస్కర్తల యొక్క జీవిత చరిత్రలు కూడా విద్యార్థులు తెలుసుకోవాలని కోరినారు. పాఠశాల పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పర్వతనేని పావని, భవనం శివ లీల, పెంట్యాల పావని, అంబటి సురేష్, వసంత రఘుబాబు, సిహెచ్ శ్రీవిద్య లక్ష్మి, పెండ్యాల రాధిక, గోబిదేశి ఆదినారాయణ, వరికల్లు బ్రహ్మయ్య, కంభాలపాటి నరసయ్య పాల్గొన్నారు.