ప్రజాశక్తి-కారంచేడు(బాపట్ల) : టిడిపి రాష్ట్ర నాయకులు నారా లోకేష్ పిలుపు మేరకు కారంచేడు గ్రామ టిడిపి సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి ఆధ్వర్యంలో సోమవారం జగనాసుర వధ కార్యక్రమం నిర్వహించారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని విజయదశమి పర్వదినం సందర్భంగా రాత్రి సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను దహనం చేశారు. సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా ఈ దసరా పండగని జరుపుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు నరేంద్ర పాతూరు శివరాం ,విలేకరి శీను, బోయిన శ్రీను ,పోతిని వెంకటేశ్వర్లు, సాయి వెంకటేష్ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.