న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మురద్‌నగర్‌లో వర్షం కారణంగా శ్మశాన వాటికలోని కాంప్లెక్స్‌లోని గ్యాలరీ పైకప్పు కూలిపోవడంతో 15 మంది మృత్యువాత పడ్డారు. ఓ వ్యక్తి అంతక్రియలు నిర్వహించేందుకు వెళ్లగా..వర్షం పడటంతో కొందరు అక్కడే ఉన్న భవనంలో తలదాల్చుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. శిథిలాల కింద మరి కొంత మంది చిక్కుకుని ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చునని సమాచారం. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) సిబ్బంది ...ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.










