Jul 30,2023 16:54

ప్రజాశక్తి-మంగళగిరి : దేశవ్యాప్తంగా చేనేతలను ఐక్యం చేసేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లుగా వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక సభ్యులు ఎం రమేష్ అన్నారు. ఆదివారం మంగళగిరిలో ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ విలేకరులతో మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా చేనేత కుటుంబాలు వివిధ సంఘాల్లో ఉన్నాయని తెలిపారు. పేద చేనేత కుటుంబాలకు సహాయ సహకారాలు అందించేందుకు కరోనా సమయంలో ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యకు అవసరమైన సహాయ సహకారాలపై ఈ సదస్సులో చర్చించడం జరుగుతుందని తెలిపారు. సభ్యుల అభిప్రాయాల మేరకు నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఆర్గనైజేషన్ భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వాల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడి పేద చేనేత కుటుంబాలకు సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒక్క శాసనసభ్యుడు కూడా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే దానిలో చేనేతలకు ప్రాధాన్యత పెరిగితే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. శాసనసభలో గానీ, పార్లమెంట్లో గాని చేనేత ప్రజాప్రతినిధుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేనేత కుటుంబాల సమస్యలపై మాట్లాడేందుకు ప్రజాప్రతినిధులు ఎన్నికకి కావాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిపై తీవ్రంగా చర్చించి అందర్నీ సమైక్యపరిచి ముందుకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా ఉన్న ఎన్నారైలు సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సదస్సు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక చైర్మన్ కె అంజన్, వ్యవస్థాపక సభ్యులు ఏ రాజ్, ఏ బి పి ఎస్ అధ్యక్షులు కే స్వామి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, ఎల్ రమణ, పి అనురాధ, మురుగుడు హనుమంతరావు, కర్నూలు ఎంపీ ఎస్ సంజీవ రాయుడు, మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి పి నరహరి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బి సురేంద్ర, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జి విజయలక్ష్మి, మాజీ మంత్రి నిమ్మల కృష్ణప్ప, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.