Aug 04,2023 12:27

మంగళగిరి (గుంటూరు) : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శుక్రవారం మంగళగిరి మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు హాజరయ్యారు. తన పరువు-ప్రతిష్టలకు భంగం కలిగించేలా వైసిపి చేసిన అవాస్తవ ఆరోపణలు, సాక్షి వేసిన తప్పుడు కథనాలపై కోర్టులో తాను దాఖలు చేసిన క్రిమినల్‌ కేసులలో వాంగ్మూలం నమోదు నిమిత్తం లోకేష్‌ ఈరోజు ఉదయం 11 గంటలకు మంగళగిరి మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకి హాజరయ్యారు. లోకేష్‌ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ నమోదు చేయనున్నారు. లోకేష్‌ వస్తున్న నేపథ్యంలో.. టిడిపి శ్రేణులు కోర్టు వద్దకు భారీగా చేరుకున్నారు.