Nov 11,2023 14:34

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి వేల కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులపై ఉన్న శ్రద్ధ.. బస్సుల కొనుగోలు, నిర్వహణపై లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ''విజయవాడ ఆర్టీసీ బస్టాండులో బస్సు ప్లాట్‌ ఫాంపైకి దూసుకెళ్లి ముగ్గురు అమాయకులు బలయ్యారు. ఈ దుర్ఘటన మరవక ముందే భీమవరం సమీపంలోని వీరవాసరంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి దూసుకెళ్లడంతో ధాన్యం వ్యాపారి మృతి చెందాడు.ఈ ప్రమాదంలో వాహనంతో పాటు చోదకుడు బస్సు కింద ఇరుక్కు పోయి మఅతిచెందారు. దాదాపు గంట తర్వాత పొక్లెయిన్‌ సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ప్రమాదానికి గురైన బస్సు బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు డ్రైవర్లు ముందుగా చెప్పినా.. స్పేర్‌ పార్టులకు డబ్బుల్లేవని మరమ్మతులతో సరిపెట్టిన దివాలాకోరు ప్రభుత్వమిది. ఇది కచ్చితంగా సర్కారీ హత్యే. మృతుడి కుటుంబానికి సరైన పరిహారం అందజేయాలి. ఇకనైనా ఆర్టీసీ గ్యారేజీల్లో మెయింటెనెన్స్‌కు నిధులు విడుదల చేయాలి'' అని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.