మంగళగిరి (గుంటూరు) : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం మంగళగిరి కోర్టుకు వెళ్లారు. వైసిపి నేతలపై వేసిన పరువు నష్టం దావా విషయంలో లోకేశ్ అదనపు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. వైసిపి నేతలు పోతుల సునీత, గుర్రంపాటి దేవేందర్ రెడ్డిలు తనపై తప్పుడు ప్రచారం చేశారని లోకేశ్ కోర్టును ఆశ్రయించారు. ఉమామహేశ్వరి మరణం, హెరిటేజ్ సంస్థపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం... వైసిపి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పరువు నష్టం దావాలో లోకేశ్ పేర్కొన్నారు.










