Dec 16,2022 16:40

ప్రజాశక్తి - దెందులూరు : దెందులూరు మండలం గోపన్నపాలెం పరిధిలో సెట్టి నాగరాజు నిమ్మ తోటలో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. దెందులూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం నిమ్మ తోట రైతు నాగరాజు ఉదయం తోటలోకి వెళ్ళగా ఒక మహిళ మృతదేహం పడి ఉండటం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మహిళ వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆత్మహత్యకు పాల్పడిన సమీపంలో పోలీసులు పురుగుల మందు డబ్బాను కనుగొన్నారు. అయితే ఆ మహిళ ఎవరు? ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది వివరాలు తెలియాల్సి ఉంది. మృతురాలిని గుర్తు పట్టినవారు దెందులూరు పోలీసులకు 9440796654 నంబరుకు సమాచారం అందించాలని ఎస్సై ఇజ్జాపు వీర్రాజు తెలిపారు. అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.