ప్రజాశక్తి-భట్టిప్రోలు : భట్టిప్రోలు మండలం ఐలవరం పైడమ్మ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామానికి చెందిన గుద్దంటి లక్ష్మీకాంతం (55) రాత్రి సమయంలో చెరువులో దూకి మృతి చెందింది. బుధవారం ఉదయం సమీప గ్రామస్తులు చేరులో మృతి చెంది బోర్లాగా పడి ఉన్న మృ దేహాన్ని గమనించి పోలీస్ లకు సమాచారం అందించగా పోలీసులు మృతదేహాన్ని బయటికి తీయటంతో లక్ష్మీకాంతంగా గుర్తించారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్థం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










