ప్రజాశక్తి-నందిగామ(ఎన్టీఆర్) :ఎంబిబిఎస్ లో ఫ్రీ సీట్ సాధించిన నందిగామ చెందిన శశి చంద్రప్రియకు నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అభినందించి సన్మానం చేశారు. మాజీ నీట్ రాత పరీక్ష నందు ఎంబిబిఎస్ ఫ్రీ సీటును సంపాదించిన వంకడోతు శశి చంద్రప్రియను పట్టణ తెదేపా కౌన్సిలర్లు మరియు తెదేపా నేతలతో కలిసి సన్మానించి మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య శుభాకాంక్షలు తెలిపారు. సౌమ్యనందిగామ నియోజకవర్గం నుంచి నీట్ రాత పరీక్షలో ఎంబిబిఎస్ ఫ్రీ సీటును సంపాదించుకున్న శశి చంద్రప్రియ మరియు వారి తల్లిదండ్రులకు ప్రత్యేకమైన అభినందనలు అని పేర్కొన్నారు.ఆదిత్య ఐఐటి/మెడికల్ అకాడమీ రైతుపేట, నందిగామ డైరెక్టర్ రామలింగేశ్వరరావు ఆదిత్య ఐఐటి/మెడికల్ అకాడమీ గత మూడేళ్లుగా నడుపబడటం ఈ సంవత్సరం మెడికల్ విభాగంలో శశి చంద్రప్రియ,ఐఐటి,ఎన్ఐఐటీలలో మహంకాళి ధీరజ్, అచ్చి బబ్లు రాజ్ ఫ్రీ సీట్ సాధించినందుకు వారికి మరియు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.శశి చంద్రప్రియ గతంలో పదవ తరగతిలో ప్రతిభ అవార్డును మాజీ ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు చేతుల మీద అందుకోవడం తన ప్రతిభకు నిదర్శనం అన్నారు.మార్గదర్శకం బాగుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు పునాదికి వెన్నముక అన్నారు.పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.










