Oct 24,2023 16:04

ప్రజాశక్తి- నందిగామ(ఎన్‌టిఆర్‌) : నందిగామ పట్టణంలోని ఎన్టీఆర్‌ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తను శ్రీ హెర్బల్‌ బ్యూటీ పార్లర్‌ను నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్‌ మోహన్‌రావు మంగళవారం ప్రారంభించారు. నిర్వహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మొండితోక జగన్‌ మోహన్‌ రావును బ్యూటీ పార్లర్‌ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు చైతన్య కుమార్‌, గుడివాడ సాంబశివరావు, దేవేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.