Oct 20,2023 12:29

ప్రజాశక్తి-నందిగామ : యుటిఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు పాత పెన్షన్ సాధనకై నందిగామ రెవిన్యూ డివిజన్ కేంద్రంలో గల కంచల సుబ్బారావు భవన్ (యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయం)నందు నిరసన దీక్షను చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమం పాల్గొన్న ఉపాధ్యాయులకు దీక్ష మాలను పదవి విరమణ చేసిన కంచర్ల వెంకట సత్యనారాయణ ప్రసాద్, చెరుకుమల్లి శ్రీనివాసరావు, బాదర్ల వీరాంజనేయులు, యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సహాధ్యక్షులు మన్నేపల్లి కృష్ణయ్య పూలదండలు వేసి దీక్షను ప్రారంభించారు.ఈ కార్యక్రమం నందు నాయకులు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారు తన అధికారంలో రావడానికి చేసిన పాదయాత్రలో ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానాన్ని తన అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ ను రద్దు చేస్తానని మాట ఇచ్చి లక్షలాది ఉద్యోగ,ఉపాధ్యాయ ఓట్లను పొంది నాలుగున్నర సంవత్సరాల తర్వాత సిపిఎస్ కన్నా దరిద్రమైన జిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగుల ఉసురు తీశారు. మాట తప్పం మడమ తిప్పం అని చెప్ప ఉద్యోగులను ఈ విధంగా చేయడం సరైనది కాదని.రాబోయే 2024 ఎన్నికలలో సిపిఎస్, జిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ను పునరుద్ధరిస్తారు వారికి మాత్రమే 13 లక్షల మంది ఉద్యోగులు ఓటు వేస్తారని వచ్చే ఎన్నికలలో ప్రతి పార్టీ రాజకీయ ఎజెండా కావాలని తెలిపారు.