
ప్రజాశక్తి- నందిగామ(ఎన్‌టిఆర్) : సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక సత్యసాయి మందిరంలో ఉచిత ఆర్థోపెటిక్ వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా.శ్రీకాంత్ మోకాలు నడుము కీళ్లు మెడ , అన్ని రకముల నొప్పులు పరీక్షించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సుమారుగా 150 మంది రోగులు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరం నందు 2000 రూపాయల విలువచేసే ఎముకల పట్టుత్వం ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ యు.వాసుదేవరావు, డాక్టర్ బొందలపాటి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.