- ఎస్ఐ శ్రీనివాస్ నాయక్, వైసీపీ మండల కన్వీనర్ తమ్మన.
ప్రజాశక్తి - ఆలమూరు : బాల బాలికలు విద్యతోపాటు క్రీడల్లోనూ విస్తృతంగా రాణించాలని ఎస్సై ఎల్.శ్రీనివాస్ నాయక్, వైసీపీ మండల కన్వీనర్, సర్పంచ్ తమ్మన శ్రీనివాస్, వైసిపి నేత, పిఠాపురం నియోజకవర్గ పరిశీలకులు చల్లా ప్రభాకర్రావు అన్నారు. ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన వివిధ క్రీడల్లో మండలంలోని చెముడు లంక ఎస్టిఎస్ఎన్ఎం హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు. ఇందులో 9వ తరగతి విద్యార్థి సూరంపూడి వీర వెంకట సత్య సాయి కుమార్ 5000 మీటర్ల రేస్ వాక్కు నందు ఉత్తమ ప్రతిభ కనపర్చి ద్వితీయ స్థానంతో విజేతగా నిలిచి, రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైనాడు. దీంతో శుక్రవారం ఈ విద్యార్థికి హెచ్ఎం బి.శివరాం కుమార్, పిడి డి.సత్తిబాబు, ఆధ్వర్యంలో అభినందన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన వారు విద్యార్థిని అభినందించి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతిభకు అభినందనే అలంకారమని వారు పేర్కొన్నారు. ఈ హైస్కూల్ నందు విద్యార్థుల సంఖ్య అధికంగానే ఉందన్నారు. ప్రతి ఒక్కరిలోని ప్రతిభ దాగుందని వెలికి తీసి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఉపాధ్యాయులను వారు కోరారు. ఈ హైస్కూల్ నుంచి జిల్లా స్థాయిలో వివిధ క్రీడల్లో విజేతలైన పలువురు విద్యార్థులు త్వరలో రాష్ట్రస్థాయిలో బాపట్ల నందు జరిగే క్రీడల్లో పాల్గొంటారని పిడి సత్తిబాబు తెలిపారు. అనంతరం సాయి కుమార్ కు దుస్సాలువా కప్పి, పూలదండ అలంకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్తిరాజు, చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.










