Nov 19,2022 16:36

ప్రజాశక్తి-నందిగామ : ప్రపంచ టాయిలెట్స్ దినోత్సవం సందర్భంగా శనివారం కేతవీరునిపాడు ప్రాథమికోన్నత పాఠశాల పారిశుధ్య కార్మికురాలు గుడిసె ఏసమ్మను  పాఠశాల విద్యార్థులు సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు పటాపంచల భూపతి రావు , సచివాలయ సెక్రటరీ రవికుమార్  మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పరిసరాలు యొక్క పరిశుభ్రతను ,మరుగుదొడ్లు వాడకపోతే వచ్చే నష్టాలను విద్యార్థులకు వివరించారు. మరియు సచివాలయం సెక్రటరీ  రవి  మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత ,మొక్కల పెంపకం వాటిన సంరక్షించడం చాలా అవసరం అని సందేశం ఇచ్చారు. అనంతరం పరిశుభ్రతపై మరియు మరుగుదొడ్ల వాడకంపై విద్యార్థులు ,ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బంది గ్రామంలో ర్యాలీని నిర్వహించారు. గ్రామస్తులకు అవగాహన కల్పించారు .ఈ కార్యక్రమం నందు ఉపాధ్యాయులు మహేశ్వర వెంకటేశ్వరరావు, కేతేపల్లి రామారావు, భూపతిరావు, సచివాలయ సెక్రటరీ రవికుమార్, వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో గ్రామస్తులతో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు.