Jul 16,2023 15:12

ప్రజాశక్తి-చీరాల : రెవెన్యూ సేవలను ప్రజలకు సకాలంలో అందిస్తూ అందరికి సుపరిచతులుగా మంచి పేరు తెచ్చుకున్న తాసిల్దార్ జీవిగుంట ప్రభాకర్ రావు చీరాల తాసిల్దారుగా బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ & మైనారిటీస్ ఐక్యవేదిక రాష్ట్ర కమిటి సభ్యులు ఆదివారం చీరాలలోని తన ఛాంబర్ లో కలసి అభినందినలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు మాట్లాడుతూ తసిల్దార్ ప్రభాకరరావు ఎక్కడ పనిచేసిన అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ, అందరివాడిగా మంచి పేరు తెచ్చుకున్నాడన్నారు. అలానే చీరాలలో కూడా ఈ సంవత్సర కాలంలో అన్ని వర్గాల ప్రజల, నాయకుల, అధికారుల మన్ననలు పొంది వారి అభిమానాన్ని చూరగోన్నారని అన్నారు. ఇలాంటి అధికారి చీరాల మండల ప్రజలకు దొరకటం అదృష్టంగా భావిస్తున్నారని, ఆయన ఇంకా ఎక్కువ కాలం చీరాల ప్రజలకు సేవలు అందించాలని మంచి పేరుతో కొనసాగుతూ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐక్యవేదిక సభ్యులు జగన్నాథం యోహాన్, కొమ్మాలపాటి బుజ్జిబాబు, బండారు చంటిబాబు, జ్యోతి శ్రీమన్నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.