
ప్రజాశక్తి-వేటపాలెం : వనిత వైష్ణవి క్లబ్ వేటపాలెం ఆధ్వర్యంలో వైద్య వృత్తిలో ఉన్నత విద్యను చదివి కార్డియో తోరాసిక్ వ్యాస్కులరీ సర్జరీ నందు పట్టా పొందిన డాక్టర్ ఎంచెర్ల సుబ్బ నరసింహ చంద్రశేఖర్ పల్మనరీ మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారి భార్య వెంకట సాయి సుస్మితను సోమవారం సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు చుండూరి గాయత్రి మాట్లాడుతూ వేటపాలెం లాంటి చిన్న గ్రామం నుండి వైద్యవృత్తి నందు ప్రధానమైనటువంటి గుండె ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి చదువును ఆర్యవైశ్య ముద్దుబిడ్డలు ఎంతో శ్రమించి విద్యలో ఉత్తీర్ణులవటము గర్వంగా ఉందన్నారు ఈ ప్రాంతంలో ఆర్యవైశ్యులలో సుమారుగా 40 సంవత్సరములు తర్వాత ఈ వైద్య వృత్తి నందు ఉన్నత పట్టా పొందటము చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యము అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. విద్య వృత్తిలో గుండె ఊపిరితిత్తులకు ఉన్న బంధం వలే ఇరువురు కూడా భార్యాభర్తలు అయి ఉండటము చాలా విశేషంగా నున్నది. ఈ కార్యక్రమంలో వేటపాలెం వనిత వైష్ణవి క్లబ్ అధ్యక్షులు తాతా సుజాత, నూకల సీతా మహాలక్ష్మి, అంబిక , మహాలక్ష్మమ్మ చెట్టు కమిటీ అధ్యక్షురాలు చుండూరి రాజ్యలక్ష్మి, మంజుల, కోడూరి రాజా రాజేంద్రప్రసాద్, చుండూరి నాగాంజనేయులు, పట్టభద్రుల సంఘం అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు, యొక్క సంఘ కార్యవర్గ సభ్యులు సత్యవాణి, అనంతలక్ష్మి, మాలేపాటి లక్ష్మీ తులసి, అలేఖ్య, కోడూరి కోటేశ్వరమ్మ తదితర పుర ప్రముఖులు వాసవి క్లబ్ అధ్యక్షులుచుండూరి శ్రీనివాసు, పేర్ల నాని, ఆకుల ప్రసాదు పాల్గొన్నారు