- తహశీల్దార్ శెట్టి, ఎఎంసి చైర్మన్ యణమదల.
ప్రజాశక్తి-ఆలమూరు : ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైద్యులు, అంగన్వాడిలు సంయుక్తంగా అందిస్తున్న సేవలు అభినందనీయమని తాహసిల్దార్ ఐ.పి.శెట్టి, ఏఎంసీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని మడికి శివారు చిలకలపాడు సచివాలయ పరిధిలో ఐసిడిఎస్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కోసం అంగన్వాడీలు ఉత్తమ పౌష్టికాహార ప్రదర్శనను, వైద్య సేవలను వారు గురువారం క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ముందుగా సర్పంచ్ ఉండ్రాజపు లక్ష్మీ మౌనిక చిన్నా అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాల్లో అంగన్వాడీలు, వైద్యులు సంయుక్తంగా చేస్తున్న సేవలను వారు అభినందించారు. గర్భిణీలు, బాలింతలు చిన్నారుల విషయంలో వారు మంచి శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. గర్భిణీలపై మరింత శ్రద్ధ తీసుకొని ఏ ఒక్క శిశువును నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. వృద్ధులు చిన్నారుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పడమటి సుజాత రాంబాబు , ఈవోపీఆర్డి రాజకుమార్, వైద్యాధికారి డాక్టర్ సువర్చల, కార్యదర్శి మోక్షంజలి, శాఖల సూపర్వైజర్లు శివప్రసాద్, నాగలక్ష్మి, వరలక్ష్మి, విఆర్వో సూర్యప్రకాష్, అంగన్వాడీలు, తదితరులు పాల్గొన్నారు.










