ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ : ఇంకొల్లు గ్రామంలోని పర్చూరు రోడ్డులో గల వైన్ షాప్ 08265 సూపర్వైజర్ అయినటువంటి మార్టూరి వెంకట ప్రశాంత్ అను అతను తన చేతివాటం చూయించి వైన్ షాపులోని 42 మద్యం బాటిలను అక్రమంగా తీసుకొని వాటిని బయట వ్యక్తులకు అధిక రేటుకు అమ్మి లాభం పొందుటకు గాను ది 04.03.2023న రాత్రి 21.30 గంటల సమయంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద ఉండగా ఇంకొల్లు SIకి రాబడిన సమాచారం మేరకు హెడ్ కానిస్టేబుల్ P. సుధాకర్ రావు మరియ సిబ్బంది వైన్ షాప్ సూపర్వైజర్ మార్టూరి వెంకట ప్రశాంత్ పట్టుకొని అతని వద్ద నుండి 42 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని రాత్రి 22.00 గంటలకు అరెస్టు చేయటమైనది.










