Jun 04,2023 21:01
  • అత్యాచార బాధితురాలికి కుజ దోషం ఉందా?
  • వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమే
  • హైకోర్టు ఆదేశాలను నిలిపేసిన సుప్రీంకోర్టు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అత్యాచార బాధితురాలి జాతకంలో కుజ దోషం ఉందో, లేదో పరిశీలించాలని అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసింది. జ్యోతిషం సైన్స్‌ ఔనా? కాదా? అనే అంశం జోలికి వెళ్లడం లేదని సర్వోనుత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిందితుని బెయిలు దరఖాస్తుపై విచారణ జరిపేటపుడు ఇటువంటి ఆదేశాలు ఇచ్చి ఉండకూడద తెలిపింది. ఇది పూర్తిగా సందర్భరహితమైన చర్య అని, వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. అసలు విషయానిు దీనితో ముడిపెట్టడానిు మాత్రమే తాము పరిశీలిస్తునాుమని తెలిపింది.
అత్యాచార బాధితురాలికి కుజ దోషం ఉందని నిందితుని తరపు న్యాయవాది అలహాబాద్‌ హైకోర్టు లకోు ధర్మాసనంలో వాదించారు. జాతకంలో కొనిు గ్రహాలు కలవడం వల్ల కుజ దోషం ఏర్పడుతుందని, ఇది సంతోషకరమైన జీవితానికి అడ్డంకిగా నిలుస్తుందని చెప్పారు. ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నిందితునికి లేదని చెప్పారు. అయితే బాధితురాలి తరపు న్యాయవాది మాట్లాడుతూ, తన క్లయింట్‌కు కుజ దోషం లేదనాురు. ఈ వాదనలపై హైకోర్టు స్పందిస్తూ, నిందితుడు, బాధితురాలు తమ పుట్టిన తేదీ, సమయంతో కూడిన బర్త్‌ చార్టులను 10 రోజుల్లోగా లకోు విశ్వవిద్యాలయంలోని జ్యోతిష్య విభాగం అధిపతికి అందజేయాలని ఆదేశించింది. ఈ ఇద్దరి జాతకాల వివరాలను మూడు వారాల్లోగా సీల్డ్‌ కవర్లో సమర్పించాలని జ్యోతిష్య విభాగాధిపతిని ఆదేశించింది.
బాధితురాలి ఆరోపణల ప్రకారం, తనను పెళ్లి చేసుకుంటాననినిందితుడు హామీ ఇవ్వడంతో అతనితో ఆమె అత్యంత సనిుహితంగా మెలిగింది. పెళ్లి చేసుకోవాలనిఆమె కోరినపుడు, ''నీకుకుజ దోషం ఉంది'' అనిచెప్పి, పెళ్లి చేసుకోవడానికి అతను తిరస్కరించాడు. ఇదిలావుండగా, నిందితునికి హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.
ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ, జ్యుడిషియల్‌ ఫోరం ఇలాంటి దరఖాస్తును అనుమతించేటపుడు ఇది ఒక అంశం కాగలదా? అనేదే ఏకైక ప్రశు అనాురు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడం కోసం సమర్ధ న్యాయస్థానం జ్యోతిషానిు పరిశీలించకూడదనాురు. హైకోర్టులో తదుపరి విచారణ జూన్‌ 26న జరుగుతుంది.
హైకోర్టు మే 23న ఇచ్చిన ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసింది. జ్యోతిషం అనేది సైన్స్‌యా? కాదా? అనే అంశం జోలికి వెళ్లడం లేదని జస్టిస్‌ సుధాంశుధూలియా, పంకజ్‌ మిట్టల్‌ వెకేషన్‌ బెంచ్‌ చెప్పింది. నిందితుని బెయిలు దరఖాస్తుపై విచారణ జరిపేటపుడు ఇటువంటి ఆదేశాలు ఇవ్వకుండా ఉండి ఉండవలసిందని తెలిపింది. హైకోర్టు పార్టీల జాతకాల నివేదికలను ఎందుకు కోరిందో అర్థంకావడం లేదని తెలిపింది. బెయిలు దరఖాస్తుపై విచారణ జరిపేటపుడు ఆస్ట్రాలజీ రిపోర్టు అవసరం లేదనిస్పష్టం చేసింది. దరఖాస్తులోని యోగ్యతల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు తెలిపింది.