ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఎస్‌పి వకుల్ జిందాల్ తెలిపిన వివరాల క్రారం.. 2017లో బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో తన అమ్మమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై పక్క ఇంటిలో ఉన్న పోలయ్య లైంగిక దాడి చేశాడు. అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో పోలయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష, నాలుగు వేల రూపాయల జరిమానా విధిస్తూ ఒంగోలు అడిషనల్ జడ్జి ఎంఎ సోమశేఖర్ సోమవారం తీర్పు ఇచ్చారు. ఏకకాలంలో శిక్షలు అమలు అయ్యేలా చేయాలని ఈ తీర్పులో పేర్కొన్నారు.