ఏలూరు : ఏలూరులో ఓ వాలంటీర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తాజాగా కేసు నమోదు చేశారు. గత నెలలో ఏలూరు జిల్లా దెందులూరు మండల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు దిశ పోలీస్ స్టేషన్ కి రాగా మహిళా ఎస్ఐ నీహారిక బాధిత బాలికతో మాటలాడి కేసు యొక్క తీవ్రత దృష్ట్యా, మరియు కేసు యొక్క దర్యాప్తు డీఎస్పీ స్థాయి అధికారి చేయవలసి ఉన్నందున, ఆ సమయంలో దిశ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ అయిన డిఎస్పీ అమరావతి బందోబస్త్ లో ఉండడం వలన నీహారిక ఎస్ఐ సంబంధిత నేరం జరిగిన దెందులూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐతో స్వయంగా మాట్లాడి దెందులూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించారు. వెంటనే దెందులూరు పోలీస్ స్టేషన్ లో బాధిత బాలిక యొక్క పిర్యాదుపై కేసును నమోదు చేసి నూజివీడు డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ కేసు దర్యాప్తులో భాగముగా బాధిత బాలికను వైద్యము కొరకు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లకు పంపించగా అక్కడనుండి విజయవాడ హాస్పటల్లో మెరుగైన వైద్యము అందించుచున్నట్లు ముద్దాయి అరెస్ట్ కొరకు రెండు టీములను ఏర్పాటు చేసినట్లుగా పత్రిక ప్రకటనలో తెలియచేసినారు.