Jun 13,2023 12:06

శాన్‌ఫ్రాన్సిస్కో  :    మేసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌లో మెసేజ్‌ ఎడిటింగ్‌ పీచర్‌ను విడుదల చేసింది.  దీంతో వినియోగదారులు డేటా మేసెజ్‌లో తప్పులను సవరించుకునే అవకాశం కలుగుతుంది.  విండోస్  బీటాలో    ఈ పీచర్ తో  టెక్ట్స్‌ సందేశాలను సవరించడానికి అనుమతిస్తోంది అని బీటా ఇన్‌ఫో తెలిపింది. మెసేజ్‌ను సెండ్‌ చేసినప్పటికీ.. 15 నిమిషాలలోపు ఎడిట్‌ చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించింది. అయితే మెసేజ్‌ను మరో డివైజ్‌లో సెండ్‌ చేస్తే.. ఈ ఎడిట్‌ చేసే అవకాశం ఉండదని తెలిపింది. ఒక్కోసారి స్పీడ్‌గా టైప్‌ చేయడంతో లేదా ఆటోకరెక్ట్‌ ఆన్‌లో ఉండటంతో తప్పు సమాచారం, సరైన డేటా పంపలేనపుడు ఈ ఆప్షన్‌ను వినియోగించవచ్చని నివేదిక పేర్కొంది. గత నెల మెటా సిఇఒ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ఈ మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.