Sep 21,2023 14:43

హైదరాబాద్‌: వాట్సప్‌ చానెల్‌ పేరిట ఆయా వ్యక్తులు, సంస్థలకు చెందిన సమాచారాన్ని తెలుసుకునే సౌలభ్యం కల్పించింది. పలు న్యూస్‌ చానెళ్లతో పాటు , సినీ, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే తమ వాట్సప్‌ చానెళ్లను ప్రారంభించారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ జాబితాలో చేరింది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ సీఎంఓ వాట్సాప్‌ చానెల్‌ ను ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను, వేదికలను ఉపయోగించుకుంటోంది. ఇదే కోవలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) 'వాట్సాప్‌ చానెల్‌' ను గురువారం ప్రారంభిస్తోంది. ఈ చానెల్‌ ద్వారా ప్రభుత్వం సీఎంఓ నుండి వెలువడే ప్రకటనలను పౌరులకు చెరవేస్తుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయ వాట్సాప్‌ చానెల్‌ ను వినియోగించుకోవడం ద్వారా సీఎం కేసీఆర్‌ వార్తలను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది' అని ఓ ప్రకటనలో తెలిపింది. ఆసక్తిగల వారు 'తెలంగాణ సీఎంఓ వాట్సప్‌ చానెల్‌ను ఫాలో అవ్వాలని సూచించింది.