
హైదరాబాద్ : నంది అవార్డు గ్రహీత, న్యాయవాది లక్ష్మణ్ గంగరాసి రాసిన విజయీభవ కేసీఆర్ పాటని శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాతూ..బీఆర్‌ఎస్ లీగల్ సెల్ న్యాయవాది, లక్ష్మణ్ రాసిన పాట చాలా బాగుందని, ఇలాంటి పాటలు ఇంకా రాయాలన్నారు.ఈ పాటకి నిర్మాతగా వ్యవహరించిన హైకోర్టు అడ్వకేట్ పత్తి ప్రవీణ్ కుమార్, దర్శకుడు అభిలాష్ సీఎచ్, సంగీతం దర్శకుడు సురేష్ బబ్బిలి, ఎడిటర్ చెన్నూరి శివకుమార్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కళ్యాణ్ రావు చెంగల్వ, హైకోర్టు న్యాయవాదులు జి.వేణుగోపాల్ రావు, ఎమ్.వేణుగోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.