Nov 11,2023 16:00

హైదరాబాద్‌: ఉమ్మడి ఏపీలో విద్యుత్‌, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో గతంలో తరచూ విద్యుత్‌ కోతలు, తాగునీటి కోసం నిరసనలు జరిగేవని చెప్పారు. హైదరాబాద్‌లో రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ''మిషన్‌ భగీరథ ద్వారా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశాం. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. నగరంలో 24 గంటల తాగునీటిని అందించాలన్నదే మా స్వప్నం. మెట్రోను రాబోయే 10 ఏళ్లలో 415 కి.మీ విస్తరించాలన్నదే మా ఎజెండా'' అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.