హైదరాబాద్ : '' ప్రత్యర్థులు డీప్‌ఫేక్ వాడి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని... నేను రష్మిక అంత ఫేమస్ కాదు '' అని మంత్రి కెటిఆర్ అన్నారు. గ్రాండ్ కాకతీయ హౌటల్‌లో #WomenAskKTR పేరుతో మహిళలతో నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ... తమ తల్లిని చూసి చాలా నేర్చుకున్నామన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తామన్నారు. డీప్‌ఫేక్ మహిళలకు మాత్రమే కాకుండా రాజకీయ నేతలకు సైతం ప్రమాదమేనని చెప్పారు. ప్రత్యర్థులు డీప్‌ఫేక్ వాడి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను రష్మిక అంత ఫేమస్ కాదని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మహిళలకు సరైన సంఖ్యలో టికెట్లు ఇవ్వలేదని.. దీనిపై బాధగా ఉందన్నారు. ఈ సంఖ్య పెరిగేలా చూస్తామని కెటిఆర్ చెప్పారు.