Jun 27,2023 16:20

విశాఖ: పెందర్తిలో గ్రామ వాలంటీర్ల బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. జోన్‌ 8 పరిధిలో చెత్త పన్ను కడితేనే అమ్మ ఒడి అకౌంట్‌లో డబ్బులు పడతాయంటూ వాట్సాప్‌ గ్రూపుల్లో గ్రామ వాలంటీరు వాయిస్‌ మెసేజ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.చెత్తపన్ను కట్టనివారు ఎవరైనా ఉంటే వెంటనే కనీసం ఐదు నెలల డబ్బులు కట్టాలని వాయిస్‌ మెసేజ్‌లు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త పన్ను కట్టనివారికి అమ్మఒడి పథకం అమలు చేయవద్దంటూ అధికారులు తమను ఆదేశించారని వాలంటీర్లు తెలిపారు. పన్ను చెల్లించలేని పేదల నుంచి ముక్కు పిండి వసూలు చేయాలనే లక్ష్యంతో అమ్మఒడి పథకానికి లింకు పెట్టడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.