
ప్రజాశక్తి-నౌపడ : శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలోని భావనపాడు సముద్రతీరానికి భారీ తిమింగలం మృతదేహం శుక్రవారం ఉదయం కొట్టుకొచ్చింది. ఉదయం సముద్రంపై వేటకు వెళ్ళిన మత్సకారులు దీనిని గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ భారీ తిమింగలం 15 మీటర్లు పొడవు, పది టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. ఇది సముద్రంలోనే మృతి చెంది ఒడ్డుకు చేరడంతో చేప మృతదేహం నుంచి దుర్వాసన వస్తున్నట్లు మత్స్యకారులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు.