ప్రజాశక్తి-బుచ్చయ్యపేట : దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, త్వరలో వారి పింఛన్ పెంచే ఆలోచన ఉందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా బుచ్చియ్యపేటలో వికలాంగులకు ట్రై సైకిళ్లు, దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగ సంక్షేమ శాఖ డైరెక్టర్ పోస్ట్ ఏర్పాటు చేస్తే బుచ్చయ్యపేట మండలానికి ఇచ్చే ఏర్పాటు చేస్తానన్నారు. ప్రతి వికలాంగుడికి తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానన్నారు. డైరీ డైరెక్టర్ గేదెలు సత్యనారాయణ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మరిసా నాని, ఎంపీడీవో సువర్ణ రాజు,వికలాంగుల సంఘం ప్రతినిధి కే.వెంకట్రావు పాల్గొన్నారు.










