- రైతులకు రుణమాఫీ చేయాలి
ప్రజాశక్తి-అనకాపల్లి : అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, రైతులకు రుణమాఫీ. చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాదం డిమాండ్ చేసారు. ఆదివారం దేవరాపల్లి సిఐటియు కార్యాలయంలో బిటి దొర అధ్యక్షతన పార్టీ విస్తృత స్తాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అయిన మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలో ఎండిపోతున్న పంటను చూసి రైతు కంటతడి పెడుతున్నారని తెలిపారు పెట్టిన పెట్టుబడికి పంట చేతికి రాదని కుంగి పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు.వర్షాలు లెక వరి పంటలు ఎండకు మలమల మాడి పోతున్నాయని పెద్దేరు, తాండవ, రైవాడ, కోనాం జలాశయాల ప్రధాన కాలువ ఆయకట్టు,బోర్లు కింద పంటలు మినహా మిగిలిన ఎండకు దెబ్బతింటున్నాయని తెలిపారు. ప్రసవ సమయంలో గర్భ విచ్చిత్తి జరిగినట్లు, పొట్ట దశలో వర్షాల్లేక వరి పంట పూర్తిగా నష్టపోతుందని రైతులు వాపోతున్నారని అన్నారు. ఖరీఫ్ లో వివిధ పంటల సాగు విస్తీర్ణం 2,04,985 సాధారణ సాగు 2,04,985 ఎకరాలకు 1,35,095 ఎకరాల్లో 66 శాతం సాగైందని, ఇందులో వరి 1,36,460 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 1,10,765 ఎకరాల్లో 81 శాతం నమోదైందని తెలిపారు. వరి సాగులో సగానికి పైగా పంట నష్టం జరగనుందని ఆందోళన వ్యక్తం చేశారు.చాలీచాలని నీటిలో మదుపులు పెట్టి ఉడుపులు వేసినా, తరువాత వర్షాలు ఎడ పెట్టడంతో చేతికి పంటరాని పరిస్థితి నెలకొందని, పొట్ట దశలో నీటి తడి ఉండాల్సిన అక్టోబర్లో వర్షాల్లేక వరి చేను ఎండు గడ్డిలా తయారవుతోందని అన్నారు. చెరుకు దిగుబడి బాగ తగ్గుతుందని వేరుశనగ, ఇతర పంటల దిగుబడులు కూడా భారీగా తగ్గనున్నాయని తెలిపారు.
ఈ నెల ఒకటి నుంచి 22వ తేదీ వరకు 178.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సివుండగా కేవలం 25.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని అన్నారు. ఖరీఫ్ ఆరంభం జూన్ నుంచి అక్టోబర్ 18 వరకు 860.8 మిల్లీ మీటర్లకు 629 మిల్లీ మీటర్ల వర్షపాతం 26 శాతం లోటు నమోదైంది. జిల్లాలోని 24 మండలాల్లో మండలాల్లో 16 వర్షపాతం లోటు ఉండగా, ఏడు మండలాల్లో సాధారణ వర్షపాతం, నమోదైందని తెలిపారు. సగానికి పైగా మండలాల్లో వర్షపాతం లోటు ఉండడంతో ఆ ప్రభావం పంటలపై పడిందని తెలిపారు. రోలుగుంట మండలంలో 24.2, రావికమతంలో -27.4, వి.మాడుగులలో 29.6, కోటపాడులో -29.1, సబ్బవరంలో - 29.2, పరవాడలో -37.9, అనకాపల్లిలో 34.1, 20.7, మాకవరపాలెంలో 40.4, మునగపాకలో 42.7, అచ్యుతాపురంలో 44.7, యలమంచిలిలో 47.6, నక్కపల్లిలో 51.9, పాయకరావుపేటలో 51, ఎస్.రాయవరంలో 33.9, రాంబిల్లిలో 50.6 మిల్లీ మీటర్ల వర్షపాతం లోటు ఉందన్నారు. దెబ్బతింటున్న పంటలు సమాచారం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని అన్నారు. వర్షపాతం వివరాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డంలేదన్నారు. కరువు తీవ్రతను అధికారికంగా ధ్రువీకరించకుండా తక్కువ చేసి చూపే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. రైతుకు పంట నష్ట పరిహారం చెల్లించకుండా ఉండేలా కరువు లేదని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాబావ పరిస్థితిలను ద్రుష్టిలో పెట్టుకోని వెంటనే అనకాపల్లి జిల్లాను కరువు ప్రకటించాలని రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసారు ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న జి గురువులు కర్రిదేముడు అప్పారావు నండాసన్నిబాబు జె సన్నబాబు తదితరులు పాల్గొన్నారు.